రణ్ వీర్ సింగ్ కండోమ్స్ కు గుడ్ బై..!

-

బాలీవుడ్ క్రేజీ హీరో రణ్ వీర్ సింగ్ కండోంస్ కు గుడ్ బై చెప్పాడు. అదేంటి విచిత్రంగా అనుకోవచ్చు. బాలీవుడ్ లో మనవాడి క్రేజ్ కు వాణిజ్య సంస్థలన్ని క్యూ కడుతున్నాయి. అందులో డ్యురెక్స్ కండోమ్ యాడ్ కూడా ఒకటి. అయితే పెళ్లి తర్వాత ఏమైందో ఏమో కాని ఆ యాడ్ ఒప్పందాన్ని కొనసాగించడానికి రణ్ వీర్ నిరాకరించాడట. డ్యురెక్స్ కండోమ్స్ కు ఇన్నాళ్లు రణ్ వీర్ సింగ్ ప్రచారం కర్తగా ఉన్నాడు.

అయితే ఇప్పుడు కండోమ్స్ కు గుడ్ బై చెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడట రణ్ వీర్ సింగ్. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రణ్ వీర్ సింగ్ రీసెంట్ గా గల్లీ బోయ్ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పద్మావత్ సినిమాకు గాను ఉత్తమ నటుడు (విమర్శకులు)గా అవార్డ్ అందుకున్నాడు. ప్రస్తుతం దీపికా, రణ్ వీర్ ఇద్దరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version