టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ఆస్తుల వివరాలను మరియు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించాడు. తొమ్మిది ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న ఏకైక రాజకీయ కుటుంబం తమదని అన్నారు నారా లోకేష్. చం ద్రబాబు, లోకేశ్, భవనేశ్వరి, బ్రాహ్మణిలతోపాటు చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఆస్తుల లెక్కలను లోకేష్ స్వయంగా ప్రకటించారు. ప్రకటించిన ఆస్తుల కంటే ఒక్క రూపాయి అదనంగా ఉన్నా నిరూపించాలంటూ సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన లోకేశ్.. ఈ వివరాలను తెలియచేశారు. చంద్రబాబు మొత్తం ఆస్తులు రూ.9కోట్లు కాగా అప్పులు రూ.5.13 కోట్లు అని, భువనేశ్వరి మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు కాగా అప్పులు 11.04 కోట్లు ఉన్నాయని వెల్లడించారు.
అలాగే నారా లోకేశ్ మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు కాగా అప్పులు రూ.5.70 కోట్లు అని, నారా బ్రాహ్మణి మొత్తం ఆస్తులు రూ. 15.68 కోట్లు కాగా అప్పులు రూ.4.17 కోట్లు అని, నారా దేవాన్ష్ మొత్తం ఆస్తులు రూ.15.68 కోట్లు కాగా అప్పులు రూ.4.17 కోట్లు ఉన్నట్టు లోకేశ్ ప్రకటించాడు. అదేవిధంగా, వైసీపీ చేసిన తప్పుడు ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే వాళ్ల ఆస్తులు ప్రకటించాలని అన్నారు. తుగ్లక్ జగన్ లాగా బినామిలు ద్వారా మేము ఆస్తులు కొనలేదు.. ఇళ్లు కట్టలేదు.. జగన్‌లా మేము బినామీ కంపెనీలు పెట్టలేదని, 5 రూపాయల షేర్‌ను భారీ ప్రీమియంకి ఎలా అమ్మారో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. జగన్ 43 వేల కోట్లు దోచుకున్నట్టు సీబీఐ చెప్పిందని దానిపై ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.