ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు లేనట్టే…మంత్రి డోలా సంచలన ప్రకటన !

-

ఏపీ వాలంటీర్లకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు లేనట్టే అంటూ ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సంచలన ప్రకటన చేశారు. వాలంటీర్ల అంశంపై కౌన్సిల్ లో చర్చ జరిగిన సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 14-08-2023 తరువాత వాలంటీర్ల రెన్యువల్ జీఓ ఇవ్వలేదని తెలిపారు.

AP Minister Dola Bala Veeranjaneyaswamy made a sensational announcement

వాలంటీర్ల రెన్యువల్ చేయకుండా అటు వలంటీర్లను, ఇటు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆగ్రహించారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. ఉద్యోగంలో లేని వాలంటీర్లకు మే వరకూ జీతాలు చెల్లించామన్నారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. ఉద్యోగంలో లేని వారి రాజీనామాలు ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. ప్రస్తుతం వాలంటీర్లు అయితే లేరని బాంబ్‌ పేల్చారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version