
టీడీపీ మాజీ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించాడు. వారి కుటుంబంతో కొంతసేపు మాట్లాడి వారికి దైర్యం చెప్పాడు, అనంతరం ఆయమ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ రెడ్డి కేవలం కక్షసాధింపు కొరకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు మోపుతున్నాడని ఆరోపించాడు. అచ్చేన్నాయుడిపై అన్యాయంగా నిందలు మోపి అభియోగాలు మోపి కేసులు పెట్టించాడని ఆయన అన్నాడు. వైసీపీ మంత్రులు దొంగ ప్రచారాలు చేస్తున్నారని దొంగలే దొంగ దొంగ అన్నట్టుందని ఆయన సెటైర్ వేశారు. అసలు ఆ ప్రాజెక్టు విలువ 151 కోట్లు అంటూ దొంగ ప్రచారాలు చేస్తున్నారని చివరికి తేలింది 3 కొట్లేనని ఆయన అన్నారు. గతంలోనే ప్రాజెక్టుపై ఫిర్యాదు వస్తే ఓ కమిటీ వేయడం జరిగిందని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావించారని వెల్లడించారు. అయినా కుంభకోణాల చరిత్ర మాది కాదని ఆర్థిక ఉగ్రవాదులు ఎవరో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.