
జగన్ రెడ్డిని లోకేశ్ నాయుడు టార్గెట్ చేశాడు. పోనీలే ఆ రెడ్డి ఈ నాయుడు బాగానే కొట్టుకుంటారు.కానీ ఏ ప్రాధాన్యం లేని కులాలు మాత్రం ఈ యుద్ధంలో ఎటుపోతాయో మాత్రం చెప్పలేం. ఆ విధంగా నిన్నగాక మొన్న వచ్చిన లోకేశ్ కు కూడా ముఖ్యమంత్రి అయిపోవాలి అన్న కలే ఉంది. పార్టీ కోసం పునరంకితం కావాలన్న ఆలోచన ఆయనలో ఉందో లేదో కానీ అర్జెంటుగా సీఎం కావాలి అని జగన్ రెడ్డికి కౌంటర్లు ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ జగన్ రెడ్డికి ఉన్న ఛార్మింగ్ లోకేశ్ కు ఉందా అన్నదే డౌట్ !తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ వేళ భాగ్యనగరి ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాట్లాడుతూ జగన్ రెడ్డిది గాలి పార్టీ అని అన్నారు. ఈ మాట విని వైసీపీ బెంబేలెత్తిపోతోంది. ఎందుకంటే లోకేశ్ ఏం మాట్లాడినా అర్థం చేసుకోవడమే తమకు కష్టం అని చెప్పే జగన్ వర్గంకు ఈ మాట మాత్రం బాగానే అర్థం అయి ఉంది.దీంతో తమ పార్టీపై లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఎలా ఇవ్వాలా అని మంత్రి అవంతి ఆలోచిస్తున్నారని టాక్. సీన్లోకి బొత్స కూడా వస్తే బెటర్ అన్న వాదన కూడా ఉంది. ఇంతకూ గాలి పార్టీ అంటే ఏంటి? ఫ్యాన్ గుర్తు ఉంది కనుక గాలి పార్టీ అయిపోయిందా ఏంటి?