అనకాపల్లి ఎంపీ టిక్కెట్ పై టిడిపిలో డైలమా.. అసంతృప్తిలో ఆ సీనియర్ నేత..

-

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిత్వంపై తెలుగుదేశం పార్టీకి అష్ట కష్టాలు మొదలయ్యాయి.. ఆ టిక్కెట్ కోసం మాజీ బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుంటే.. ఆయనకు పోటీగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పావులు కదుపుతున్నారు.. దీంతో అనకాపల్లి ఎంపీ సీటు చుట్టూ టిడిపి రాజకీయం మొదలైంది.. వలస నేతకు చెక్ పెట్టేందుకు సీనియర్లు ఏకమవుతున్నారట.. ఇంతకీ టిడిపిలో సీనియర్లు ఎందుకు రగిలిపోతున్నారో చూద్దాం..

ఉమ్మడి విశాఖ జిల్లాలో సీట్ల పంచాయతీ టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.. సీనియర్ల నుంచి వస్తున్న ఒత్తిడి ఒకవైపు అయితే.. జనసేన పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఇరకాటంలో పడ్డారట.. ఉత్తరాంధ్రలో కీలక ఎంపీ సెగ్మెంట్ గా ఉన్న అనకాపల్లి సీటు కోసం టిడిపిలో సీనియర్లు.. జనసేనలో జూనియర్లు తెగ ట్రై చేస్తున్నారట. ఇక్కడ పోటీ చేసేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ రెండేళ్ల క్రితమే గ్రౌండ్ వర్క్ రెడీ చేసిందట. తన రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడు విజయ్ కి ఇవ్వాలనుకుంటున్నానని.. అనకాపల్లి ఎంపీ సీటు తనకే కేటాయించాలంటూ చంద్రబాబు నాయుడు వద్ద అయ్యన్నపాత్రుడు తన మనసులోని మాట చెప్పేసారని పార్టీ నుంచి టాక్ వినిపిస్తుంది. కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. కచ్చితంగా ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారట.

కష్టకాలంలో.. పార్టీకి అండగా ఉండడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కొన్నామని దీన్ని పరిగణలోకి తీసుకొని తనతో పాటు తన కుమారుడి కూడా టికెట్ కేటాయించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేస్తున్నారట. ఇదే సమయంలో టిడిపి అనుకూల మీడియాలో ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో.. అయ్యన్నపాత్రుడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.. ఇస్తే తమ ఫ్యామిలీ వారికి టికెట్ ఇవ్వాలని.. లేదంటే స్థానికులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని వలస నేతలకు టికెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా ఓటమి ఖాయం అంటూ ఆయన తన అభిప్రాయాన్ని అధినేత వద్ద చెబుతున్నారట.

విజయవాడ నుంచి తన కోసం అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే.. అనకాపల్లి ఎంపీ సీట్ అయినా ఇవ్వాలంటూ బుద్ధ వెంకన్న చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టారని పార్టీలో చర్చ నడుస్తుంది. తమ పూర్వికులు అనకాపల్లి ప్రాంతానికి చెందిన వారిని.. అక్కడ తమ కుటుంబానికి బలమైన బ్యాగ్రౌండ్ ఉందని బుద్ధ వెంకన్న చెబుతున్నారట. మరోపక్క మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.. టిడిపిలో మూడుముక్కలాట నడుస్తూ ఉండడంతో ఎవరికి టికెట్ వాళ్ళు అర్థం కాక టిడిపి అధినాయకత్వం తలలు పట్టుకుంటుందని పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు.. దీంతో టీడీపీ మరో ఈక్వేషన్ ని తెరపైకి తీసుకువచ్చింది. పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటును జనసేనకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నుంచి లీకు రావడంతో ఆశావాహులు అయోమయంలో పడ్డారట..

Read more RELATED
Recommended to you

Exit mobile version