టిడిపి-జనసేన పొత్తుతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2019 ఎన్నికలలో విడిగా పోటీ చేయడం వల్ల టిడిపి, జనసేన నష్టపోయాయనే విషయం జగమెరిగిన సత్యం. దాదాపు 50 సీట్లలో డ్యామేజ్ జరగగా, వైసీపీకి కలిసొచ్చింది. అదే సమయంలో నరసాపురం పార్లమెంటు పరిధిలో కూడా టిడిపి-జనసేన నష్టపోయాయి. ఈ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకొల్లు, ఉండి, నరసాపురం, భీమవరం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం.
2019లో పాలకొల్లు, ఉండిలో టీడీపీ గెలవగా, మిగిలిన అన్ని నియోజక వర్గాలలో వైసిపి నే గెలిచింది. 2019లో టిడిపి, జనసేన విడివిడిగా పోటీ చేశాయి, అదే వైసీపీకి ప్లస్ అయిందని టిడిపి, జనసేన నాయకులు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేసుంటే నరసాపురం పార్లమెంటుతో సహా ఏడు అసెంబ్లీ స్థానాలను స్వీప్ చేసే వారని అందరూ అంటున్నారు.
పాలకొల్లు, ఉండిలో టిడిపి విజయం సాధించింది, మిగిలిన ఐదు స్థానాల్లో వైసిపి గెలిచింది. వైసీపీ గెలిచిన ఐదు స్థానాల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు కంటే టిడిపి-జనసేనలకు వచ్చిన ఓట్లు ఎక్కువే. ఈసారి ఎన్నికల్లో టిడిపి- జనసేన పొత్తు ఏర్పడడంతో నరసాపురం పార్లమెంటు సహా అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని టిడిపి, జనసేన నాయకులు ధీమాతో ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం తమ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పొత్తులో ఓట్లు సరిగ్గా బదిలీ కాకపోతే మళ్ళీ వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఓటర్లు ఎవరికి ఛాన్స్ ఇస్తారో వేచి చూడాల్సిందే!