ఓటుకు నోటు కేసులో ఏమీ చేయలేరు..

-

అమరావతి: ఓటుకు నోటు కేసులో తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని ఇంటరాగేషన్లు, ఇన్విస్ట్‌గేషన్లు చేసుకున్నా తమకేమీ ఫర్వాలేదన్నారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తాము చాలా క్లియర్ గా ఉన్నామన్నారు. హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నాయకుడును జగ్గారెడ్డిని కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. ఎన్నికల వచ్చినప్పుడు మాత్రమే విపక్ష నాయకులపై కేంద్ర ప్రభుత్వం ఐటీ, సీబీఐ, పోలీసులతో దాడులకు పాల్పడుతోందని మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు.

తమిళనాడు, కర్ణాటకల మాదిరిగానే తెలంగాణాలోనూ ఇటువంటి దాడులే జరుగుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా అధికార వ్యవస్థలను తన చేతులోకి తీసుకుని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏపీపైనా ప్రధాని మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. విభజన సమస్యలు అమలు చేయడంలో ఆయన విఫమయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలకు వివరిస్తామన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక నాయకులను చూసి జగన్, పవన్ కల్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు.అంతర్గతంగా రాజకీయ విమర్శలు చేసుకున్నా ఫర్వాలేదని, బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రం రాష్ట్రాభివృద్ధికి అంతా కలిసికట్టుగా ఉండాలని హితవు సోమిరెడ్డి పలికారు.

జీవీఎల్ కు కనీస అవగాహన లేదు…
ప్రకృతి సేద్యంపై ప్రసంగించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడును ఐక్యరాజ్యసమితి ఎన్విరానిమెంట్ డైరెక్టర్ ఎరిక్ సోథిమ్ ఆహ్వానించారని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. వివిధ 15 మంది దేశాధ్యక్షులు, మంత్రులు, అధికారులు వస్తే, వారిలో ఆరేడుగురికి మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారన్నారు. వారిలో చంద్రబాబునాయుడు ఒకరన్నారు. కొందరు నేతలు మాత్రం సినిమా హాలులో కూర్చొని మాట్లాడుతున్నారంటూ ఎగతాళి చేశారన్నారు.

ఏపీకి గుర్తింపు వస్తే అది రాష్ట్ర ప్రజలకు, రైతులకు పేరొచ్చినట్లు కాదా అని నిలదీశారు. వీళ్లు రాజకీయ నాయకులేనా…వాళ్లకి మానవత్వం ఉందా అని మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. ఏపీసీడీలు రానివారు కూడా పీడీ అకౌంట్లపై మాట్లాడుతున్నారన్నారు. కనీస అవగాహన, అర్థపర్థం లేకుండా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version