తెలుగుదేశం పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి సీనియర్లు ఎంతగానో కష్టపడ్డారు.. కొందరు టిక్కెట్లను కూడా త్యాగం చెశారు.. మరికొందరు ఆస్తులను అమ్ముకుని ఎన్నికల్లో గెలిచార.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రి పదవి దక్కుతుందని భావించిన నేతలకు.. చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు.. కొత్తవారిని క్యాబినెట్ లోకి తీసుకోవడంతో కొందరు సీనియర్లు పార్టీకి దూరమయ్యారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది..
పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా సీనియర్ నేతలు కనిపించడం లేదు.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు జిల్లాల వారీగా విరాళాలు సేకరించాలని సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు ఆదేశాలను సీనియర్ నేతలు లైట్ తీసుకున్నారట.. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే అంతర్గత సమావేశాల్లో చెప్పారని పార్టీలో తెగ చర్చ నడుస్తోంది..
తమకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో క్యాడర్ నుంచి విరాళాలను సేకరించలేకపోయామని.. కొన్ని జిల్లాలకు చెందిన సీనియర్లు నేరుగా చంద్రబాబు వద్దే నోరు విప్పారట.. విరాళాలు సేకరించకపోవడం వెనుక సీనియర్ల అసంతృప్తే కారణమని తెలుస్తోంది.. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదన్న ఆవేదన నేతల్లో కనిపిస్తోందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. నామినెటెడ్ పదవులు కూడా భర్తీ కాకపోవడంతో.. నియోజకవర్గాల్లో సీనియర్ల పరిస్థితి ఇబ్బంది కరంగా ఉందట.
ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసి.. పార్టీ అధికారంలోకి వచ్చినా.. తాము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనే భావన కల్గుతోందని ఓ సీనియర్ ఎమ్మెల్యే తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడ్డారట.. జూనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు తమను అవమానించారని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే.. ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడారని పార్టీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇదే అసంతృప్తి కొనసాగితే.. పార్టీకి పెద్ద డ్యామేజ్ తప్పదనే అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తపరుస్తున్నారు..