గణేష్ నిమజ్జనం వచ్చిందంటే.. చాలు అందరూ ఎంతో ఆసక్తిగా బాలాపూర్ లడ్డు ఈసారి ఎంతకు వేలం వేశారు అని అడుగుతుంటారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఎప్పుడూ..? అని ఆరా తీస్తుంటారు చాలా మంది. ఈరెండు వినాయకుళ్లకు ప్రత్యేక స్థానముంది. 2024లో 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహా గణేషుడు ఉంటే.. రూ.31,1000కి బాలాపూర్ లడ్డు వేలం పాడారు కొలన్ శంకర్ రెడ్డి.
ఇవాళ మధ్యాహ్నం మహా గణనాథుడి నిమజ్జనం జరిగింది. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి వీక్షించారు. అనుకున్న సమయానికే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేశారు. ఇక బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం కూడా ముగిసింది. బాలాపూర్ నిమజ్జనం ఎప్పుడైనా అర్థరాత్రి సమయానికి జరిగేది. శోభయాత్రలో చాలా నెమ్మదిగా సాగడంతో లేట్ అవుతూ వచ్చేది. కానీ ఈ సారి వేగంగా శోభయాత్ర నిర్వహించడంతో సాయంత్రమే బాలాపూర్ గణేషుని నిమజ్జనం జరిగింది. ఈ రెండు వినాయకుల నిమజ్జనం జరిగితే నగరంలో సగం వినాయకులు ఖాలీ అయినట్టే అంటుంటారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడికి భారీ బందోబస్తు నిర్వహిస్తారు పోలీసులు. బాలాపూర్ గణేషుడికి కూడా బందోబస్త్ ఉంటుంది. రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జనం జరుగుతుందని డీజీపీ వెల్లడించారు.