చేతల్లోనే చూపిస్తా..పవన్ దెబ్బ పేర్నికే ఫస్ట్.!

-

రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి అధికార వైసీపీ అమలు చేసే వ్యూహాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అలాగే ప్రత్యర్ధులు చేసే విమర్శలకు కౌంటరు ఇవ్వడానికి కూడా ఒక స్ట్రాటజీ అమలు చేస్తుంది. ప్రత్యర్ధి పార్టీల్లో ఎవరైతే విమర్శలు చేస్తారో..వారి సొంత కులానికి చెందిన వైసీపీ నేతలతోనే తిట్టిస్తారు. అదే వైసీపీ ఎత్తుగడ..ఉదాహరణకు చంద్రబాబుని తిట్టడానికి కొడాలి నాని వస్తారు. వీరిద్దరిది ఒకటే కులం.  ఇక పవన్‌ని తిట్టడానికి పేర్ని నాని వస్తారు. ఈ ఇద్దరిది ఒకటే కులం.

అయితే ఇలా తిడుతుండటంతో టి‌డి‌పి శ్రేణులు కొడాలిపై, జనసేన శ్రేణులు పేర్నిపై రగిలిపోతూ ఉంటారు. వచ్చే ఎన్నికల్లో వీరిని ఎలాగైనా ఓడించాలని కసితో ఉన్నారు. కొడాలిని గుడివాడలో ఓడించాలని టి‌డి‌పి శ్రేణులు చూస్తున్నాయి. సరే అది సాధ్యమయ్యే పని కాదు. ఆ విషయం పక్కన పెడితే మచిలీపట్నంలో పేర్నికి చెక్ పెట్టాలని జనసేన చూస్తుంది. అయితే ఇక్కడ కాస్త ఛాన్స్ ఉంది. కాకపోతే టి‌డి‌పి సపోర్ట్ ఉంటేనే..జనసేన పేర్నికి చెక్ పెట్టగలదు. అది కూడా టి‌డి‌పి చేత చెక్ పెట్టించాలి. ఆ రెండు పార్టీలు కలిస్తే పేర్నికి చెక్ పడటం ఖాయం.

ఎందుకంటే గత ఎన్నికల్లో పేర్ని గెలిచింది..ఓట్లు చీలిపోవడం వల్ల. గత ఎన్నికల్లో పేర్ని నాని వైసీపీ నుంచి పోటీ చేసి..టి‌డి‌పి నేత కొల్లు రవీంద్రపై దాదాపు 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక అక్కడ జనసేనకు 18 వేల ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పి, జనసేన కలిస్తే అప్పుడే పేర్ని గెలిచేవారు కాదు. ఈ సారి రెండు పార్టీలు కలవడానికి చూస్తున్నాయి. దీంతో పేర్నికి కాస్త ఎదురుదెబ్బ తప్పదు.

అయితే నెక్స్ట్ పేర్ని తప్పుకుని తన వారసుడుని బరిలో దించుతున్నారు. దీంతో టి‌డి‌పి, జనసేన పొత్తు ఎఫెక్ట్ పేర్ని వారసుడుపై పడుతుంది. గెలుపు కష్టం అయ్యే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version