టీడీపీతో పొత్తుకి బైబై…బయటికి వచ్చే ఆలోచనలో పవన్‌…

-

రాజకీయాల్లో ఆవేశం పనికిరాదంటారు కొందరు సీనియర్‌లు. అలాంటి వారు నిలకడగా ఉండలేరని…ప్రజామోదాన్ని గెలుచుకోలేరని తరచుగా చెబుతుంటారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. ఆవేశంతో మీసాలు మెలేయడం,తొడలు చరచడం,సినిమాల్లో మాదిరిగా డైలాగులు వదలడం… ఇలాంటివి సుదీర్ఘ రజాకీయ ప్రయాణానికి ఏమాత్రం పనికిరావు. మొన్నామధ్య చంద్రబాబుని జైళ్ళో పెట్టాక ఆగమేఘాల మీద మీడియా ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌..

తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించారు.ఆ తరువాత జైలుకెళ్ళి చంద్రబాబును పరామర్శించారు.ఈ పొత్తు సరైంది కాదని జనసేన కార్యకర్తలు అప్పటినుంచే చెబుతున్నారు. అయితే ఇప్పటికి వాస్తవాన్ని తెలుసుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఎట్టకేలకు పొత్తుపై కామెంట్‌ చేశారు. ఇది ధర్మం కాదని చంద్రబాబును ఉద్దేశించి తెగేసి చెప్పేశారు. పనిలో పనిగా రాజోలు,రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు పోటీలో ఉంటారని ప్రకటించారు.

అసలేం జరిగిందంటే……ఏపిలో ఎన్నికల సభలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఇదేక్రమంలో అరకులో పర్యటించిన చంద్రబాబు అక్కడ అభ్యర్ధిని ప్రకటించారు. ఆ తరువాత మండపేటలోనే అభ్యర్ధిని ఖరారు చేశారు. ఓవైపు జనసేనతో పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలను పవన్‌కళ్యాణ్‌ తప్పుబట్టారు. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించడం లేదన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్న పవన్‌ కళ్యాణ్‌ రిపబ్లిక్‌డే రోజున బాంబ్‌ పేల్చారు.

తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించలేదని, తాను చాలా సహనంతో, పెద్ద మనసుతో నడుచుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో తనపైన కూడా పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి వచ్చిందని గుర్తు చేశారు.అయితే కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన క్యాడర్ కు మింగుడు పడడం లేదు.టీడీపీ వల్ల జనసేనకు కలిసి వచ్చే అంశాలు కనిపించడం లేదని, జనసేన వల్లే టీడీపీ లాభపడుతోందని చెప్తున్న కేడర్‌…మునిగిపోతున్న నావకు మనం జీవం పోసినట్లవుతుందని ముందునుండి జనసేన పవన్‌కి చెబుతూ వస్తోంది.

ఒక దశలో టీడీపీతో పొత్తు వ్యవహారం పై ఇష్టం లేని వారు పార్టీని వీడి వెళ్ళిపోవచ్చని హుకుం కూడా జారీ చేశారు పవన్‌. దీంతో జనసేన క్యాడర్ లో ఒకింత అసహనం వచ్చింది. తెలుగుదేశం జెండా మోయడానికి, బ్యానర్లు కట్టడానికి ఉన్నామా అంటూ కొంతమంది తిరగబడిన సందర్భాలు ఉన్నాయి.అంతేకాదు సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు కొంత జనసేనకు దూరమయ్యారు. ఇష్టం లేని వారు వేరే పార్టీకి వెళ్ళిపోయారు.కొంతమంది సైలెంట్ అయిపోయారు. దీంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గిపోతూ వచ్చింది.దీనికితోడు లోకేష్ సీఎం పదవి పై చేసిన కామెంట్ దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే ఇప్పటికైనా తమ నాయకుడు కళ్ళు తెరిచాడని కేడర్‌ సంబరాలు చేసుకుంటోంది.ఒంటరిగా బరిలోకి దిగి ఈసారి సత్తా చాటుతామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి పవన్‌ సిద్ధమయ్యాడని తాజా పరిణామాలను బట్టి రాజకీయ నిపుణులు చెప్తున్నారు. బిజేపీతో కలిసి బరిలో దిగే విధంగా అడుగులు వేద్దామని పార్టీ క్యాడర్ పవన్ కళ్యాణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగానే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కొంతమంది పాస్టర్లతో సమావేశమైనపుడు బిజేపీతో వెళితే మా పరిస్థితి ఏమిటనే విషయం కూడా చర్చకు వచ్చిందట.బిజేపీతో కలిసి ట్రావెల్ చేసినా ఎలాంటి లోటు రానివ్వబోనని పాస్టర్లకు పవన్ గ్యారంటీ ఇచ్చారట.

దీంతో అవసరమైతే టీడీపితో తెగతెంపులు చేసుకుని బిజేపితో కలిసిపోటీ చేసే అవకాశం కూడాలేకపోలేదని చర్చించుకుంటున్నారు. జనసేన ఇచ్చిన తొలి అల్టిమేటమ్ పై టీడీపి స్పందించే తీరును బట్టి పవన్‌ అడుగులు వేసే అవకాశం లేకపోలేదు.అయితే చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలో తేడాలు రావడంతోనే పవన్‌ కళ్యాణ్‌ ఇలా మాట్లాడుతున్నారని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.పవన్‌ని వెనక నుంచి భారతీయ జనతాపార్టీ నడిపిస్తుందా అనే రూమర్‌లు కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version