జయరాంకు వైసీపీ షాక్.. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్య

-

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాక్ తగిలింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది వైసీపీ.. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఖరారు అయ్యారు. రేపు రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Kurnool Mayor B. Y. Ramaiah as MP candidate

ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించిన గుమ్మనూర్ జయరాం.. అధిష్టానం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. అయితే… మంత్రి గుమ్మనూరు జయరాం జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది.

కాగా తిరుపతి జిల్లాలోని వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నియోజకవర్గ నాయకులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు ఎంపీ లాడ్స్ నుంచి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version