ఏపీలో జనసేనకు ఎక్కువ బలం ఉన్న జిల్లాలు ఏవి అంటే..ఠక్కున గోదావరి జిల్లాలు అని చెప్పవచ్చు. పవన్ కాపు వర్గం కావడం, ఆ రెండు జిల్లాల్లో కాపు వర్గం ఓట్లు ఎక్కువ ఉండటం తో జనసేనకు..గోదావరి జిల్లాల్లో బలం ఉంది. ఇక కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో కూడా బలం ఉంది గాని..గోదావరి జిల్లాల అంతా కాదు. అందుకే ఈ జిల్లాలపైనే జనసేన ఆశలు పెట్టుకుంది.
గత ఎన్నికల్లో జనసేన అసలు ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది..అది కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు సీటు. అయితే ఈ సారి ఎన్నికల్లో కనీసం 10 సీట్లు అయిన గెలుచుకోవాలని జనసేన టార్గెట్ గా పెట్టుకుంది. కాకపోతే ఒంటరిగా పోటీ చేస్తే అన్నీ సీట్లు రావడం కష్టం..అదే టిడిపితో పొత్తు ఉంటే జనసేన సత్తా చాటే ఛాన్స్ ఉంది. ఎలాగో పవన్ పొత్తు దిశగానే వెళుతున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో కీలకమైన సీట్లు తీసుకుని సత్తా చాటాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో జనసేన గెలవలేదు గాని…ఓట్లు చీల్చి టిడిపిని ఓడించింది. వైసీపీని గెలిపించింది. అంటే కొన్ని సీట్లలో టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే..జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. ఇప్పుడు అలాంటి సీట్లనే జనసేన టార్గెట్ చేసుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం,తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు, తణుకు లాంటి సీట్లపై ఫోకస్ పెట్టింది..వీటిల్లో తణుకు దక్కడం కష్టం గాని..మిగిలిన సీట్లు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది.
ఇటు తూర్పు గోదావరిలో రాజోలు ఎలాగో జనసేన సీటు..ఇక అమలాపురం, రాజానగరం, రాజమండ్రి రూరల్, కాకినాడ సిటీ లేదా రూరల్, పిఠాపురం, ముమ్మిడివరం లాంటి సీట్లని టార్గెట్ గా పెట్టుకుంది. టిడిపితో పొత్తు ఉంటే జనసేన సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.