స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్ధతు తెలిపి పవన్ కల్యాణ్ రాంగ్ స్టెప్ వేశారా? ఒకవేళ బాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని అనుకుంటే మద్ధతు ఇవ్వడంలో తప్పు లేదని, కానీ ఓ అవినీతి కేసులో అరెస్ట్ అవ్వడం, అవినీతి జరిగినట్లు కోర్టు అంగీకరిస్తూ బాబుని రిమాండ్‌కు పంపించిన పవన్..అదే విధంగా మద్ధతు తెలిపి పూర్తిగా రాంగ్ స్టెప్ వేశారని సొంత జనసేన పార్టీ వాళ్ళే భావిస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని రాజకీయం చేస్తున్న బాబు..ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యారు. ఆయనకు బెయిల్ వస్తుందా? ఏం జరుగుతుందనేది తర్వాత విషయం. కానీ రిమాండ్ విధించడం అనేది పక్కాగా కేసులో ఇరుక్కున్నట్లే.
అలాంటప్పుడు పవన్..బాబుకు మద్ధతు తెలపడం, రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు బంద్‌కు పిలుపునిస్తే..ఆ బంద్‌కు పవన్ మద్ధతు తెలపడం అనేది సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు బాబు తప్పు చేశారని మెజారిటీ ప్రజలు భవిస్తున్నారని, అలాంటప్పుడు బాబుతో ఏకీభవించడం వల్ల పవన్‌కే నష్టమని చెబుతున్నారు.
కొందరు జనసేన శ్రేణులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. మద్ధతు తెలపకుండా అటు వైసీపీ అవినీతి పార్టీ, ఇటు టిడిపి కూడా అవినీతి పార్ట్ అని ప్రజల్లోకి వెళ్ళి జనసేన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుందని, అలా కాకుండా బాబుకు మద్ధతు ఇవ్వడం వల్ల టిడిపికి జనసేన తోక పార్టీగానే ఉంటుందని చెబుతున్నారు.
మొత్తానికి పవన్ రాంగ్ స్టెప్ వేశారని సొంత పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. టిడిపి చేస్తున్న బంద్‌కు మద్దతు అని పవన్ ప్రకటించిన, జనసేన శ్రేణులు మాత్రం క్షేత్ర స్థాయిలో మద్ధతు ఇవ్వడం లేదు. వారు సైలెంట్ గానే ఉంటున్నారు.