బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసిన పీసీసీ ఛీప్.. ఆ నిర్ణయం వెనుక వ్యూహమేంటంటే..?

-

చేతిలో అధికారముంటే చాలు.. ప్రత్యర్ది పార్టీలను బలహీనం చేసేందుకు అనేక రకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి.. ఇందులో భాగంగా ఆ పార్టీలో ఉండే కీలక నేతల్ని పార్టీలోకి తీసుకుంటూ ఉంటారు.. ఇలాంటి రాజకీయాలకు కేసీయార్ ప్రసిద్ది.. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసేందుకు అనేక వ్యూహాలు రచించారు.. ఎంతో మందిని పార్టీలోకి తీసుకున్నారు.. కానీ చివరికి మొన్న జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది..

పదేళ్ల పాటు కేసీయార్ ఫాలో అయిన రాజకీయాలను ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు.. బీఆర్ఎస్ ను బలహీన పరిచేందుకు ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు.. ఇప్పటికే పలువురు పార్టీలో చేరగా.. త్వరలో మరింత మంది వస్తారనే ప్రచారం తెలంగాణాలో నడుస్తోంది.. ఈ ప్రచారాలతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చే వారి వల్ల తమ పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ ఛీప్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.. చేరికలకు బ్రేక్ వేసేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోబోమని ఆయన మాటల వెనుక ఉన్నఅర్దమంటూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు.. తెలుగుదేశం పార్టీ కూడా యాక్టివ్ అవుతున్న నేపధ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని.. స్వంత పార్టీ నేతలను నిర్లక్ష్యం చేస్తే పార్టీకి ప్రమాదమని పీసీసీ ఛీప్ భావిస్తున్నారట.. ఈ క్రమంలో అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని.. మహేష్ గౌడ్ సరైన నిర్ణయమే తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.. ఈ నిర్ణయం బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్లేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version