జగన్‌కు బిగ్ షాక్… సీఆర్డీఏ రద్దు చ‌ట్టంపై హైకోర్టులో పిటిషన్..

-

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. పాత చట్టాన్ని, సీఆర్డీఏని రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా మరో చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత సీఆర్డీఏ చట్టంలో ఉన్న నిబంధనలు, దాని కింద జారీ చేసిన నోటిఫికేషన్లు, జీవోలు అన్ని రద్దయిపోతాయి. ఇదిలా ఉంటే.. తాజాగా సీఆర్డీఏ రద్దు చట్టంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఆర్డీఏ రద్దు చట్టంపై హై కోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఏపీ శాసనసభ ఆమోదించిన బిల్లు సస్పెండ్ చేయాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు. బిల్లు నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు పిటిషినర్ విజ్ఞప్తి చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఏపీ సీఎం, మంత్రులను ప్రతివాదులుగా చేర్చుతూ పిల్ దాఖలు చేసి షాక్ ఇచ్చారు. మ‌రోవైపు అమరావతి రైతులు ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ ఆ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం మూడు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఇవాల్టీతో ఆ సమావేశాలు ముగియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version