దేశంలో ఏకైక నేతాజీ గుడి అక్కడే, దళిత మహిళ పూజలు…!

-

నేతాజి సుభాష్ చంద్రబోసు” జననం ఉండి మరణం లేని ఏకైక వ్యక్తి ఆయన. స్వాతంత్ర సమరయోధుడుగా దేశం కోసం వీర పోరాటం చేసిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. అయితే ఆయన ఏ విధంగా మరణించారు అనేది మాత్రం ఇప్పటి వరకు ప్రపంచానికి ఒక స్పష్టత అనేది లేదు. ఓడిస్సాలోని కటక్ లో సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897లో జన్మించారు. “నువ్వు నాకు రక్తాన్నివ్వు, నేను నీకు స్వాతంత్ర్యాన్నిస్తాను” అంటూ,

స్వాతంత్ర ఉద్యమంలో ఆంగ్లేయులకు దీటుగా పోరాడారు నేతాజీ. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి. దీనిని ఘనంగా చెయ్యాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. యూపీలోని వారణాసి జిల్లాలోని ఆజాద్ హింద్ మార్గ్ వద్దనున్న సుభాష్ భవన్‌లో రెండు రోజుల పాటు సుభాష్ మహోత్సవ్ ని ఉత్సవాన్నివిశాల్ భారత్ సంస్థాన్ నిర్వహించనుంది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ ఆలయాన్ని కూడా వారు ప్రారంభించనున్నారు.

ఈ ఆలయంలో ఒక దళిత మహిళ పూజలు తొలిసారి నిర్వహించనుంది. ఆలయాన్ని సంస్థ వ్యవస్థాపకులు, బీహెచ్‌యూకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ శ్రీవాస్తవ్ సొంత ఖర్చులతో నిర్మించారు. డాక్టర్ రాజీవ్ శ్రీవాస్తవ్ కొన్ని దశాబ్దాలుగా నేతాజీ జీవితంపై ఎన్నో పరిశోధనలు సాగిస్తున్నారు. ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన తన సొంత ఇంటికి సుభాష్ భవన్ అని పేరు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version