సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సీటు ఆశించిన వారికి అందరికి ఇవ్వలేవు కాబట్టి కొన్ని హామీలు ఇస్తూ ఉంటాయి. పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు, గెలుస్తారు అనుకున్న వాళ్లకు సీటు ఇవ్వడం, ఆ తర్వాత అసంతృప్తిగా ఉన్న వాళ్లకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇస్తా అనడం, లేదా కార్పోరేషన్, లేదా రాజ్యసభ ఇలా హామీలు ఇస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో కూడా ఎన్నికల సమయంలో అదే జరిగింది.
వైసీపీ నుంచి చాలా మంది 2014 లో ఓడిపోయిన వాళ్ళు 2019 ఎన్నికల్లో అద్రుష్టం పరిక్షించుకోవాలి అని భావించారు. చాలా మంది టికెట్ల కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అయితే జగన్ గెలుస్తారు అనుకునే వాళ్ళకే అవకాశం ఇచ్చారు, వాళ్లకు కార్పోరేషన్ సహా అనేక పదవులకు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా 30 నుంచి 40 మంది వరకు ఎమ్మెల్సి పదవి ఇస్తా అని ఆయన హామీలు ఇచ్చారు.
దీనితో పార్టీలో అసంతృప్తి అనేది దాదాపుగా తగ్గింది. అయితే ఇప్పుడు ఆర్టికల్ 169 ప్రకారం ఆయన మండలిని రద్దు చేస్తా అని చెప్తున్నారు. అదే జరిగితే ఆయన హామీలు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా జగన్ కి అడ్డం పడే అవకాశం ఉంది. కోట్లు ఖర్చు చేసిన వాళ్ళే వారందరూ. దీనితో మండలి రద్దు చేయడం అనేది జరిగితే వాళ్ళ భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది. అలాగే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు,
మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారికి కూడా ఎమ్మెల్సీలు ఇవ్వాలి. వాళ్ళు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి. ఒకవేళ జగన్ మొండి పట్టుకి పోయి మండలి రద్దు చేస్తే మాత్రం మునిగిపోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే అంటున్నారు. రాయలసీమలో అసంతృప్తులు మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎలాగూ రెండేళ్ళు ఆగితే మండలిలో ఆయనకు బలం పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు.