పిఠాపురం టిడిపిలో రేగుతున్న మంటలు.. తీవ్ర సంతృప్తిలో ఇంచార్జ్ వర్మ

-

పిఠాపురం నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటన చెయ్యడంతో తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు.. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. చంద్రబాబు, లోకేష్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు. పార్టీ కోసం కస్టపడి పని చేసిన సత్యనారాయణ వర్మను కాదని.. పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం పై అసమ్మతి సెగ రాజుకుంది.. ముకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు టీడీపీ నేతలు సిద్దమయ్యారు..

కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.. ఈ క్రమంలో ఇక్కడి నుంచి పోటీ చేస్తే తాను గెలుస్తానని పవన్ భావించారు.. తోలుతా తిరుపతి, బీమవరం వంటి నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా.. అక్కడ రాజకీయ పరిస్థితులు బాగాలేవని పవన్ కళ్యాణ్ చేయించుకున్న సర్వేల్లో వచ్చిందట.. దింతో అయన ఎంపీ గా వెళ్లాలని అనుకున్నా.. చివరికి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.. పవన్ ప్రకటనతో టీడీపీ లో అసమ్మతి సెగ రాజకుంది.. ఇంచార్జి వర్మతో పాటు టీడీపీ నేతలు రోడ్డెక్కి.. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలను చింపేశారు.. చంద్రబాబు తమకు అన్యాయం చేసారంటు.. పెద్ద ఎత్తున ఆందోళన చేసారు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో 1,86,682 ఓట్లు పోలయ్యాయి.. టిడిపి నుంచి ఎస్వీఎస్ఎస్ వర్మ పోటీ చేసి 68,467 ఓట్లు సాధించారు.. జనసేన కి ఇక్కడ వచ్చిన ఓట్లు కేవలం 28 వేలే.. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు.. వర్మ సహకారం లేకుండా.. పవన్ గెలవడం అసాధ్యం.. దింతో పవన్ కళ్యాణ్ కూడా వర్మనీ పిలిపించుకుని మాట్లాడాలని ఆలోచిస్తున్నారట.. మొత్తంగా వర్మ, అతని అనుచరులు దెబ్బకు టీడీపీ అధిష్టానం, పవన్ కూడా ఆలోచనలో పడ్డారని సమాచారం

Read more RELATED
Recommended to you

Exit mobile version