రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే నితీశ్‌కు మద్దతిస్తా : ప్రశాంత్ కిశోర్

-

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండేళ్లలో 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తాను బిహార్‌లో ప్రచారాన్ని ఆపేస్తానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఇచ్చిన వాగ్దానాలపై ఆయన స్పందించారు. బిహార్‌లో ఏర్పడిన మహాగఠ్‌ బంధన్‌ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తాను ‘జన్‌ సురాజ్‌ అభియాన్‌’’ను ఉపసంహరించుకొని నీతీశ్‌కు మద్దతు ప్రకటిస్తానని తెలిపారు.

ఇటీవల స్వాతంత్ర్య వేడుకల్లో నీతీశ్ కుమార్‌ మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. తేజస్వీ యాదవ్‌ లాంటి యువతరం నేతల సహకారంతో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. నీతీశ్‌ వ్యాఖ్యలపై ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా స్పందించారు.

బిహార్‌ రాజకీయాల్లోకి తాను వచ్చి కేవలం మూడు నెలలే అవుతుందోని, కానీ, ఈ స్వల్పకాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరిగాయని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని సంచలనాలు జరగొచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా సీఎం నీతీశ్‌పై పీకే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి పదవి కోసం ఇతర పార్టీలన్నీ ప్రయాసలు పడుతుంటే.. నీతీశ్ కుమార్‌ మాత్రం ఫెవికాల్‌ వేసుకొని మరీ సీఎం కుర్చీకి అతుక్కుని కూర్చున్నారు’’ అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version