కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, టీఆర్ఎస్ ప్రజలే శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, లేకుంటే మళ్లీ పూర్వపు రోజులు వస్తాయని మంత్రి అన్నారు. మన నాయకుడిపై కొందరు నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారు, మనం ఎందుకు ఊర్కోవాలి అని ప్రశ్నించారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు.
కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేము – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
-