తెలంగాణలో ప్రధాని మోదీ టూర్.. ఎప్పుడొస్తున్నారంటే..!

-

యాత్రలతో తెలంగాణలో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ.ఎంపీలు బండి సంజయ్,ధర్మపురి అరవింద్.. ఇంకా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, మరో నేత ఈటెల రాజేందర్ కూడా ఎమ్మెల్యేలతో కలిసి ఓటర్ల ను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడగా భారతీయ జనతా పార్టీ మరింతగా స్పీడు పెంచింది. 17 ఎంపీ సీట్లకు గాను కనీసం10 సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోడ్ రాక ముందే ప్రధాని సహా అగ్రనేతల పర్యటనతో ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది.

మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ మేరకు పర్యటన మూఢ ఖరారు అయింది. మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. మార్చ్ 4న ఆదిలాబాద్ జిల్లాలోని కార్యక్రమాల్లో, 5న సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రొగ్రామ్స్ లలో ప్రధాని మోదీ పాల్గొoటారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభల్లో మోడీ మాట్లాడి కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు.

మార్చి 4న ఉదయం ప్రధాని మోడీ నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ నుంచి 9.20 కి హెలికాఫ్టర్ లో బయలుదేరుతారు. 10.20కి ఆదిలాబాద్ చేరుకొని.. 11 గంటల వరకు పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 11.15 నుంచి 12 గంటల వరకు ఆదిలాబాద్‌లో జరిగి బిజెపి భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. తర్వాత ఆదిలాబాద్ నుంచి నాందేడ్ మీదుగా తమిళనాడు బయలుదేరి వేళ్తారు. తమిళనాడులో కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి 7.45 కి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి రాజ్ భవన్ లోనే ప్రధాని బస చేయనున్నారు.

సంగారెడ్డి జిల్లాలో మార్చి 5న ప్రధాని మోడీ పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు బేగం పేట్ ఎయిర్ పోర్టు నుంచి సంగారెడ్డి బయలుదేరి వెళ్లి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సంగారెడ్డిలో బిజెపి భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఆ సభ తర్వాత తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఒడిశా బయలుదేరి వెళ్తారు.ప్రధాని మోడీ రాకతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది బీజేపీ. మోడీ పర్యటనలకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు మొదలుపెట్టారు.మోడీ పర్యటనలోనే అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version