ఆస్తి కోసం అత్త, మామపై కాల్పులు జరిపిన అల్లుడు

-

ప్రస్తుతం రోజు రోజుకు మానవ సంబంధాలు మంటలో కలిసిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తంతు కొనసాగుతుంది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారం, హత్య, భర్త వేధింపులు, ఆత్మహత్యలు ఇలాంటి సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ భర్త ఆస్తి కోసం బెదిరింపులకు పాల్పడిన విధానం చూస్తుంటే ఆశ్చర్యపోకుండా ఎవ్వరూ ఉండరు. వరకట్నం కోసం భార్యను వేధించడమే కాకుండా.. అత్తింటి వారిని బెదిరింపులకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్లితే..  తెలంగాణలోని మంచిర్యాల జిల్లాల కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం పిల్లనిచ్చిన అత్త, మామపై గన్ తో కాల్పులు జరిపాడు అల్లుడు. ప్రస్తతం పరారీలో అల్లుడు నరేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నరేందర్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version