దళిత బందుతో కొత్త చిక్కులు..  ఆ వర్గాల నుంచి టీఆర్ఎస్ పై ఒత్తిడి

-

దళిత బందు ( Dalitha Bandhu Scheme )హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని పార్టీలన్నీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్​ఎస్​ పార్టీ అయితే ఏకంగా అక్కడ ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక రకాల హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం విశేషం. ఇక ఈ పథకం ప్రభావం నియోజకవర్గంలో ఉన్న ఇతర కులాల వారి మీద కూడా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ స్కీమ్​ తమ పార్టీని గట్టెక్కిస్తుందనే విశ్వాసంతో టీఆర్​ఎస్​ వర్గాల వారు ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం ఈ పథకం టీఆర్ఎస్​ పార్టీకి మైనస్​ అవుతుందని విశ్లేషిస్తున్నారు. దళితులకు పది లక్షల చొప్పున డబ్బులను ఇస్తే మిగతా వారు కూడా తమ సామాజిక వర్గానికి ఈ పథకాన్ని అమలు చేయాలని పట్టుబడతారని అప్పుడు మొదటికే మోసం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా నియోజకవర్గంలో ఉన్న కొంత మంది దళితులు అసలు దళిత బంధు పథకాన్ని నమ్మడం లేదు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పథకం అమలులోనే ఉండదని తాము ఈ పథకాన్ని నమ్మడం లేదని కుండ బద్దలు కొడుతున్నారు.

ఇక నియోజకవర్గంలో ఉన్న మిగతా సామాజిక వర్గాల వారు తమను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించడం గమనార్హం. దళిత బంధు కేవలం హుజూరాబాద్​ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసమే ప్రవేశపెట్టారని చాలా మంది భావిస్తుండటం వల్లే ముఖ్యమంత్రి తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేశారని చెబుతున్నారు. కానీ వాసాలమర్రి లో దళితుల జనాభా చాలా తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version