సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు నిర్మాత నట్టి కుమార్ ప్రకటించారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కోసమే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. అలాగే రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి చేయడంలో మాజీ సీఎం వైఎస్ఆర్ ను ప్రస్తతం సీఎం జగన్ మించిపోయాడని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలనను అందించడంలో సీఎం జగన్ స్థాయి బాగుందని అన్నారు.
ప్రతి పక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా.. అభివృద్ధిని అడ్డుకున్నా.. జగన్ తన సుపరిపాలనను కొనసాగిస్తున్నాడని అన్నారు. అలాగే మంత్రి కొడాలి నాని నోరును అదుపులో ఉంచడాని కే గుడివాడ క్యాసినో వివాదాన్ని టీడీపీ నాయకులు పెద్దదిగా చేస్తున్నారని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. టీడీనీ నాయకుల బెదిరింపులకు మంత్రి కొడాలి నాని గానీ, వైసీపీ కార్యకర్తలు గానీ భయపడరని అన్నారు. అలాగే వైసీపీ తరపున టీడీపీ తో పాటు ప్రతిపక్షాలను ఎదుర్కొవడానికి తాను సిద్దంగా ఉంటానని నిర్మాత నట్టి కుమార్ ప్రకటించారు.