పువ్వాడ మాస్టర్ స్కెచ్..ఖమ్మంలో హ్యాట్రిక్.!

-

పువ్వాడ మాస్టర్: తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో పువ్వాడ అజయ్ ఒకరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెంది ఈయన ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో ఈయనపై బాధ్యత చాలా ఉంది. జిల్లాపై పట్టు సాధించి..అక్కడ ఈ సారి బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం తీసుకురావాలి. అదే సమయంలో ఈయన కూడా మళ్ళీ గెలవాలి. అయితే గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే బి‌ఆర్‌ఎస్ గెలిచింది..ఒక్క ఖమ్మం సీటులోనే.

పువ్వాడ అజయ్ ..టి‌డి‌పి‌పై పది వేల ఓట్ల తేడాతో గెలిచారు. తర్వాత మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. దీంతో జిల్లాపై ఆయనకు పట్టు పెరిగింది. కాకపోతే అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది..అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బి‌ఆర్‌ఎస్‌కు రిస్క్ ఉంది. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ పట్టు పెరిగేలా పువ్వాడ ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలో గిరిజన ఓటు బ్యాంకుతో పాటు కమ్మ, బీసీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఇక ఆ ఓట్లని టార్గెట్ చేసి పువ్వాడ రాజకీయం మొదలుపెట్టారు.

గతంలో కమ్మ, బీసీ ఓట్లు ఎక్కువ టి‌డి‌పి వైపు ఉండేవి. ఇప్పుడు టి‌డి‌పి పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఈ నేపథ్యంలో ఆ ఓట్లని బి‌ఆర్‌ఎస్ వైపు మళ్లించడానికి పువ్వాడ ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో ఖమ్మం నడిబొడ్డున శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి…దాన్ని జూనియర్ ఎన్టీఆర్ చేత ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహంతో కమ్మ, శ్రీకృష్ణుడు రూపంతో యాదవ వర్గం ఓట్లని టార్గెట్ చేశారు.

పైగా జిల్లాలో నందమూరి అభిమానులు ఎక్కువే..అందుకే వారి ఓట్లని సంపాదించడానికి పువ్వాడ ఈ ప్లాన్ చేశారు. ఇక పువ్వాడ ప్రాతినిధ్యం వహించే ఖమ్మం అసెంబ్లీ లో కమ్మ, యాదవ ఓట్లు దాదాపు 90 వేల వరకు ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహంతో ఆ ఓట్లని దక్కించుకుని హ్యాట్రిక్ పై కన్నేశారు. మరి పువ్వాడ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version