ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పెన్షన్ లు పొందేవారికి శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. నెలవారీగా ఇచ్చే పెన్షన్ కోసం.. ఇకపై కాళ్లరిగేలా తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే పెన్షన్ ను చేరవేసేలా కార్యాచరణ అమలు చేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గ్రామ, వార్డు వలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించారు. అయితే దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ వరప్రసాద్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
వృద్ధులకు పెన్షన్ ను ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమేనని చెబుతూ, గత ప్రభుత్వం ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చి ఇంటికి పంపిందని పీవీపీ వరప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “పెన్షన్ ఇంటికి పంపించే ప్రభుత్వం ఒకటి, ఉద్యోగులను నిరుద్యోగులను చేసి ఇంటికి పంపే ప్రభుత్వం ఇంకొకటి ! మీరే చూజ్ చేసుకోండి ఆంధ్రులారా, చంద్రగ్రహణమా? లేక జగన్మోహనమా?” అని ఆయన ప్రశ్నించారు. మరి దీనికి ఆంధ్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.
పెన్షన్ ఇంటికి పంపించే ప్రభుత్వం ఒకటి, ఉద్యోగులను నిరుద్యోగులను చేసి ఇంటికి పంపే ప్రభుత్వం ఇంకొకటి ! మీరే Choose చేసుకోండి ఆంధ్రులారా, చంద్రగ్రహణమా లేక జగన్మోహనమా ?#JaiAndhra
— PVP (@PrasadVPotluri) February 4, 2020