‘బోసడీకే’ రాజకీయం… రాజుగారు ఇలా కూడా చేస్తారా?

-

ఎంత యాంటీ అయితే మాత్రం ప్రతి విషయంలోనూ జగన్‌ని తిట్టాలని రూల్ ఏమి లేదనే చెప్పాలి….కానీ రఘురామకృష్ణంరాజుకు అలాంటివి ఏమి ఉండవు…. పరిస్తితి ఏదైనా, ఏ అంశమైన జగన్‌పై విమర్శలు చేయడమే రాజుగారి డ్యూటీ… గెలిచిందేమో వైసీపీలో… పనిచేసేది మాత్రం టీడీపీ కోసం. ఆయన ఎన్నిరకాలుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

అయితే ప్రతి విషయంలోనూ జగన్‌ని నెగిటివ్ చేయడం, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటం రాజుగారి వంతు అయిపోయింది. తాజాగా టి‌డి‌పి నేత పట్టాభి… సి‌ఎం జగన్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక సి‌ఎం స్థాయి వ్యక్తిని ‘బోసడీకే’ అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో ఇలాంటి మాటలు కరెక్ట్ కాదనే చెప్పాలి. అలా అని చంద్రబాబుని వైసీపీ నేతలు సైతం బూతులు తిట్టారు. అది కూడా కరెక్ట్ కాదనే చెప్పాలి.

అయితే పట్టాభి… జగన్‌ని తిట్టినందుకు నిరసనగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టి‌డి‌పి ఆఫీసులపై దాడులు చేశాయి. ఇక దాడులు కూడా ఏ మాత్రం కరెక్ట్ కాదనే చెప్పాలి. అటు పట్టాభి వ్యాఖ్యలని, ఇటు వైసీపీ దాడులని ఖండించాల్సిన అవసరముంది. కానీ మన రాజుగారు అలాంటి పని చేయరుగా…. టి‌డి‌పి ఆఫీసులపై దాడి కరెక్ట్ కాదని మాట్లాడుతూనే, వైసీపీ నేతలు బూతులు మాట్లాడలేదా…ఇక పట్టాభి మాట్లాడిన బోసడీకే అంటే తిట్టు కాదని తేల్చారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్‌లో ఉందని రాజుగారు చెప్పుకొచ్చారు.

దాని అర్ధం ఏమైనా కానీ… పట్టాభి తిట్టిన సందర్భం వేరు… అదేమీ పట్టించుకోకుండా గూగుల్లో అర్ధాలు చెప్పే పనిలో రాజు గారు ఉన్నారు. అంటే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని చెప్పి పట్టాభి మాటలని సమర్ధిస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఎవరు బూతులు మాట్లాడినా సమర్ధనీయం కాదనే చెప్పాలి. టి‌డి‌పి ఆఫీసులపై దాడులు ఖండించినప్పుడు… పట్టాభి వ్యాఖ్యలని కూడా ఖండించాల్సిన బాధ్యత రాజుగారిపై ఉంది. కానీ ఆయన టి‌డి‌పి మనిషి కాబట్టి అలా చేయలేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version