హైడ్రా, మూసీ నిర్మాణల కూల్చివేతల వెనుక రాహుల్ గాంధీ : కేటీఆర్

-

హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటైన ‘హైడ్రా’, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హస్తం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టును డబ్బు సంచుల కోసమే రాహుల్ అనుమతి ఇచ్చాడన్నారు. హైడ్రాను రేవంత్ రెడ్డి కాదు.. రాహుల్ గాంధీనే నడిపిస్తున్నాడని, ఆయన వెనుక ఉండి పేదల ఇండ్ల పైకి బుల్డోజర్లను పంపిస్తున్నారని విమర్శించారు.

నగరంలో బుల్డోజర్ ప్రభుత్వం తీరుతో ప్రజలు చనిపోతుంటే రాహుల్ ఎక్కడున్నాడని, ఎన్నికల టైంలో తెలంగాణలో చిన్నపిల్లగాడు పిలిచినా సరే వస్తాను? అని చెప్పిన ఆయన ఇప్పుడెందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీకి డబ్బుల కట్టలు పంపేందుకే రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూల్చివేయిస్తోందన్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో కూడా తమకు తెలుసని.. ఆ వివరాలను త్వరలోనే బయటపెడతానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హస్తినలోని కాంగ్రెస్‌కు మూసీ నోట్ల కట్టలు కావాలి కానీ, మూసీ బాధితులు కష్టాలు పట్టవా? అని ప్రశ్నించారు. ఇది మూసీ ‘బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటీఫికేషన్’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version