బీజేపీతో కుమ్మక్కయ్యే సోనియాగాంధీ నాయకత్వం పై నిరసన తెలుపుతూ లేఖ రాసారనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేసారు. సిడబ్ల్యుసి భేటీలో రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. నాయకత్వ మార్పు పై సమయం సందర్భం చూసుకోకుండా లేఖ రాయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను రాజీనామా చేసినపుడు అధ్యక్ష భాద్యతలు చెపట్టేందుకు సోనియా విముఖత చూపారని, సిడబ్ల్యుసి సభ్యుల ప్రోద్బలం తో సోనియా అధ్యక్ష భాద్యతలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు.
ఆరోగ్యం బాలేనప్పుడు ఆసుపత్రిలో చేరిన సమయంలో లేఖ ఎలా రాస్తారని ఆయన నేతలను ప్రశ్నించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటకు ఎలా వెళ్తున్నాయని నిలదీశారు. పార్టీ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో నాయకత్వం పై విమర్శలు చేస్తూ లేఖలు రాయడం భావ్యమా అని ప్రశ్నలు వేసారు. అంతర్గతంగా చర్చించుకోవలసిన అంశాలు కూడా బహిరంగంగా ఎందుకు చర్చిస్తున్నారని, అంతర్గతంగా చర్చించుకోవలసిన కీలక అంశాలు సిడబ్ల్యుసి లో చర్చించాలి కానీ మీడియాలో కాదు కదా అన్నారు ఆయన.