ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఎంతలా పతనమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ ఎక్కడుందో అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇటు తెలంగాణలో కూడా మొదట్లో కొంత బలంగానే ఉన్నా కూడా కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టి సలు కాంగ్రెస్ లో ఎవరూ లేకుండా చేసేశారు. ఇక ఏపీలో అయితే అసలు అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. రీసెంట్‌గా కాంగ్రెస్ పగ్గాలు రేవంత్‌కు ఇవ్వడంతో కొత్త జోష్ కనిపిస్తోంది. దీంతో కార్యకర్తలు కూడా బాగానే పనిచేస్తున్నారు. పార్టీలో ఊపు పెరిగింది.
అయితే ఇదంతా రేవంత్ రెడ్డి వల్లనే అని చెప్పొచ్చు. టీపీసీసీ అధ్యక్షుడిగా రాహుల్ అనుకున్నట్టుగానే విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు రేవంత్‌రెడ్డి. మొన్నటి వరకు ఆ పార్టీ నుంచి అందరూ వెళ్లిపోగా ఇప్పుడు ఆ పార్టీలోకే చేరికలు వస్తున్నాయి. దీంతో రాహుల్ గాంధీ ఇప్పుడు ఏపీలోని కాంగ్రెస్ పార్టీపై తన మార్కు చూపించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే పార్టీ పట్టు వస్తోందో అలాగే ఏపీలో కూడా రావాలంటు్నారు.
కాగా ఇందుకోసం ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరిపారు. ఏపీలో కూడా రేవంత్‌రెడ్డి లాంటి దూకుడు నేతలు కావాలని చూస్తున్నారంట. ఇందుకోసం ఒక్కరు సరిపోరని కనీసం ముగ్గురైనా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీని నడిపించాలంటూ కోరుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. అలాగే కేవీపీ రామచంద్రరావుతో కూడా మంతనాలు చేస్తున్నారంట. అన్నీ కుదిరితే వీరిలో ఎవరికో ఒకరికి పార్టీని అప్పగించే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారో.