Undavalli Sridevi : ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ

-

గుంటూరు : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది. మందడం నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని.. మార్గమధ్యంలో దళిత మహిళ రైతులు, రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఈ నేపథ్యంలోనే దళిత మహిళ రైతులు, రైతులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందడం నూతన సచివాలయం ప్రారంభోత్స కార్యక్రమం నుంచి ఉండవల్లి శ్రీదేవి వెళ్ళగానే.. రైతులను పోలీసులు వదిలిపెట్టారు. అయితే పోలీసుల తీరుపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాజధాని రైతుల సమస్యలపై వినతి పత్రం ఇద్దామనుకుంటే అరెస్టు చేశారని దళిత రైతులు పోలీసులపై మండిపడ్డారు. ఇది ఇలా ఉండగా  అమరావతి రాజధాని ఉద్యమం పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిలో జరిగేది ఫోటో ఉద్యమం మాత్రమేనని.. పేర్కొన్నారు.  మందడం నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే శ్రీదేవి. సీఎం జగన్ తో రాజధాని అభివృద్ధి జరుగుతుందని తెలిపిన ఆమె…. రైతులు ఎవరూ తమ సమస్యలపై తనను కలవలేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version