చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారు…!

-

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ నుంచి మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మోహన్ బాబు లేదా చిరంజీవిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు కూడా పలు మార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో అయన కేంద్ర మంత్రిగా పని చేసారు.

ఇప్పుడు మళ్ళీ ఆయన రాజ్యసభకు వెళ్ళాలి అని భావిస్తున్నారు. త్వరలో ఆయన్ను రాజ్యసభకు బిజెపి ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, జగన్ మధ్య చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. పార్టీ ఫండ్ కూడా చిరంజీవి ఇచ్చారని సోషల మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఆయనను పర్యాటక శాఖ సహాయ మంత్రిగా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడిని కలవడానికి ఢిల్లీ వెళ్ళిన జగన్ ఈ విషయమై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యసభలో వైసీపీ బలం ఈ ఏడాది పెరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన్ను పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే సైరా సినిమాను చూపించడానికి చిరంజీవి ప్రధానిని కూడా కలిసారు. ఆ సమయంలో కూడా దీనిపై చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. పవన్ కి అడ్డు కట్ట వెయ్యాలి అంటే చిరంజీవిని దారిలోకి తెచ్చుకోవాలని పవన్ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version