రంఘనాథరాజు ఫిర్యాదు వెనక దాగున్న రాజకీయ కోణం?

-

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై.. ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం, పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఫిర్యాదులో మంత్రి పొందుపరిచారు.

అయితే ఈ విషయంలో సీరియస్ అయిన శ్రీరంగనాథ రాజు… రఘురామకృష్ణం రాజుని తిరిగి దూషించవచ్చు.. తిరిగి ఆరోపణలు చేయవచ్చు.. తిరిగి మరింతగా ఫైరవ్వొచ్చు.. కానీ ప్రత్యేకంగా కేసు పెట్టడంపైనే స్థానికంగా హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీ కేబినెట్ మార్పులు చేర్పుల్లో భాగంగా… ఆచంట నుంచి ఎన్నికైన ఏపీ మంత్రి శ్రీ రంగనాథరాజు మంత్రి పదవికి బీటలువారే పరిస్థితి వచ్చిందని కామెంట్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ దగ్గర మార్కులు పొందే క్రమంలో కూడా ఈ ఆలోచన చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కానీ… ప్రతీదానికీ లిమిట్ ఉంటుంది.. అది ఇప్పటికే రఘురామకృష్ణం రాజు చాలా సార్లు దాటేశారు కాబట్టి… రంగనాథరాజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా… రఘురామకృష్ణం రాజు వ్యవహారం మాత్రం ఏపీ రాజకీయాలతోపాటు మరిముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనూ, ఆయన సామాజికవర్గంలోనూ టూమచ్ హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి. కాకపోతే.. ఆయన్ని సమర్ధించేవారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంటుండటం కొసమెరుపు!

కాగా… నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరిస్తూ.. అటు అధిష్టాణాన్ని, ఇటు సభ్యులనూ టార్చర్ పెడుతున్నంత పని చేస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు పై ఇప్పటికే పార్టీ సీరియస్ అవ్వడం, ఆయనపై అనర్హత వేటు వేయించే దిశగా ఢిల్లీ వేదికగా పనులు చేసుకుంటూ పోవడం తెలిసిన విషయమే!

Read more RELATED
Recommended to you

Exit mobile version