రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాన్నుంచి డైవర్షన్ కోసం మా కేడర్ పై అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలు చేస్తున్నారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియా ద్వారా ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే టెక్నాలజీ అందుబాటులో ఉంది. చంద్రబాబు తన చేతిలో ఉన్న ఎల్లోమీడియాని కట్టడి చేయగలరు. కానీ సోషల్ మీడియాని కట్టడి చేయలేరు. వైసీపి సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అంటూ ఎల్లోమీడియాలో రాయించుకున్నారు. ముచ్చుమర్రి ఘటనలో బాలిక ఆనవాళ్లు కనపడకపోయినా ఈ పత్రికలు వార్తలు రాయలేదు.
చంద్రబాబు రోడ్డు మీద గుంటలకు శంకుస్థాపన చేస్తే అదొక పెద్ద కార్యక్రమంగా వార్తలు రాశారు. చట్టపరమైన పనులు చేసే పోలీసు అధికారులను బదిలీలు చేస్తున్నారు. అక్రమమైన పనులు చేసేవారికి మంచి పోస్టులు ఇస్తున్నారు. జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారనీ, పట్టాభిని పోలీసులు కొట్టారని తప్పుడు వార్తలు రాశారు. ఎల్లోమీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా మారాయి. నారా లోకేష్ తన ట్విట్టర్ లో దారుణమైన దూషణలు చేశారు. యూట్యూబ్ ఛానల్స్‌లో జగన్ ని దారుణంగా తిడుతూ మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ కారకుడు నారా లోకేష్. టీడీపీ సోషల్ మీడియా ఉన్మాద కారాగారం. టీడీపీ అరాచకాన్ని అడ్డుకోలేరుగానీ మావారిపై మాత్రం అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించిన అంబటి.. రేపు డీజీపిని స్వయంగా కలుస్తాం.. అవసరమైతే ప్రైవేట్ కేసులు వేస్తాం అని అన్నారు.