రూ.9394 వేల కోట్లలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన రాయపాటి

-

ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తా…… ఇటీవల యువగళం పాదయాత్రలో ఓ సందర్భంలో నారా లోకేష్‌ చెప్పిన మాట ఇది. అందుకు తగినట్లు గానే వ్యవహరిస్తున్నారు టీడీపీ నేతలు. బ్యాంకులకు టోకరా వేయడం.. జనాన్ని నిలువునా ముంచేయడమే చంద్రబాబు బ్యాచ్‌ అర్హతలను విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు విషయంలో ఇదే ఋజువైందని అంటున్నారు.కాగా టీడీపీ హయాంలో బ్యాంక్‌లను బురిడీ కొట్టించిన నేతల చరిత్ర ఒక్కొక్కటి బయటపడుతోంది. దేశంలోనే అతిపెద్ద లోన్‌ స్కామ్‌ ఇదేనని తాజాగా ఈడీ గుర్తించింది. ఇంకా మరికొందరిపేర్లు కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు.

రాయపాటి సాంబశివరావు 13 బ్యాంక్‌లలో రూ.9394 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఈ నగదును రాయపాటి షెల్ కంపెనీలకి తరలించారు. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు ఈ నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది.ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తేలింది. 2019లోనే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించింన సంగతి తెలిసిందే. తాజాగా మనీలాండరింగ్ కేసులో రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. ఆ రుణం ఇప్పుడు వడ్డీతో కలిపి దాదాపు ముప్పయి వేల కోట్లకు చేరినట్లు బ్యాంకులు లెక్కేసాయి.ఈ విషయంలో ఈడీ అధికారులు మరింత గట్టిగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

రాయపాటితో పాటు సుజనాచౌదరి,సీఎం రమేష్‌ వంటి నేతలు చంద్రబాబు అండచూసుకుని వేలకోట్లు పోగేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు చంద్రబాబు పూర్తిగా సపోర్ట్ చేస్తారని విమర్శిస్తున్నారు. అలా వచ్చిన డబ్బునే మళ్ళీ పార్టీ కోసం ఎన్నికలకోసం ఖర్చు చేసి తమ రుణం తీర్చుకోవడం ఈ నేతల పనిగా మారిందని తిట్టిపోస్తున్నారు. పార్టీ రుణం అయితే తీరుస్తారు కానీ బ్యాంకులకు కట్టాల్సిన రుణం మాత్రం ఎగ్గొడతారని తప్పుబట్టారు. ఈ బ్యాచ్ మొత్తం ఇదే వృత్తి ..ప్రవృత్తిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారని,ఇలాంటి వారికి ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version