జగనన్న సురక్షను సూపర్ హిట్ చేసిన నేతలు

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా సూపర్‌హిట్‌ అవుతోంది. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను చేరవేస్తూ సరికొత్త చితర్రకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌.ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయో పబ్లిక్‌ పల్స్‌ తెలుసుకునేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కూడా విజయవంతమైంది. తాజాగా లబ్దిదారులకు ధృవీకరణ పత్రాలు అందించే లక్ష్యంతో చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం కూడా సూపర్‌ సక్సెస్‌ అయింది.నెలరోజుల పాటు సాగి ఈ కార్యక్రమం ప్రజలకు వైసీపీ నేతలను ప్రజాప్రతినిథులను మరింత చేరవ చేసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 

జగనన్న సురక్ష అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా జులై 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు సాగింది. ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చే ఈ ప్రత్యేక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,004 గ్రామ సచివాలయాల పరిధిలో జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమయ్యే కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలకు అక్కడే దరఖాస్తులు స్వీకరించడం, ఇంటింటికి వెళ్లి వెనువెంటనే అక్కడికక్కడే వాటిని మంజూరు చేసే ప్రక్రియ ద్వారా ప్రజలకు డబ్బు, సమయం అదా అయ్యేలా ప్రభుత్వం సహకరించింది. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లుతో కలిసి ప్రజాప్రతినిథులు 93, 57, 707 సర్టిఫికెట్స్ అందించారు. దాదాపు 5. 3 కోట్ల మందికి చేరువ అయ్యేలా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 1, 46, 27, 905 కుటుంబాలను కలిసి దాదాపు 11 రకాల సర్టిఫికెట్స్ , ఇంకా రేషన్ కార్డు లో మార్పులు, చేర్పులు వంటివి చేపట్టి అక్కడికక్కడే మంజూరు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు సీఎం జగన్‌.

 

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు విద్యార్ధులు చాలా సులభంగా ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. కానీ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ధృవీకరణ ప్రతాలు పొందాలంటే గతంలో ఓ ప్రయాసలా ఉండేది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విద్యార్ధులు విలువైన సమయాన్ని వృధా చేసుకునేవారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే విద్యార్ధులు పలు కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్ళలో చేరడం, రిజర్వేషన్ కోటాలో ఇంజినీరింగ్ , మెడిసిన్, ఇంకా ఫార్మసీ, ఎంబీఏ వంటి పెద్ద కోర్సుల్లో చేరాలంటే కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా ఇవ్వాలి.కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు ఆయా మండల కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుని వాటి కోసం ఎదురుచూస్తూ ఉండేవారు.

ఆ సమయంలో అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉన్నా,సర్వర్‌లు పనిచేయకపోయినా పాపం విద్యార్ధులకు నెలల తరబడి నిరీక్షణ కొనసాగేది.అప్పట్లో వందలకొద్దీ సర్టిఫికేట్‌లు ఒకేసారి ఇవ్వాలన్నా అధికారులకు చాలా కష్టంగా ఉండేది. ధృవీకరణ పత్రాలు సరైన సమయానికి సబ్‌మిట్‌ చేయకపోతే కాలేజీలో లేదా హాస్టల్‌లో విద్యార్ధులు సీటు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం వలన విద్యార్ధులకు ఇప్పుడు ఆ నిరీక్షణ తప్పింది. జగనన్న సురక్ష కార్యక్రమంతో ధృవీకరణ పత్రాలు పొందడం సులభతరమైంది. సీఎం తీసుకువచ్చిన ఈ కార్యక్రమం పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తపరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version