రాములమ్మ రేసులోకి వచ్చేనా..? ఆమె మౌనం వెనుక కారణం ఏంటంటే..?

-

సినీ పరిశ్రమలో విజయశాంతి ఓ వెలుగు వెలిగారు.. పెద్ద హీరోలతో పాటు.. అడపాదడపా యంగ్ స్టార్ తో కూడా లీడ్ రోల్ ను తళ్లుక్కుమన్నారు.. సినిమాల్లో హిట్ అయిన ఆమె.. రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు.. లేడీ ఓరియంటెండ్ సినిమాల్లో విలన్స్ ను చిత్తుచేసిన ఆమె.. పొలిటికల్ ప్రత్యర్దులను ఎదుర్కొలేకపోయారు.. ప్రస్తతం కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా.. సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.. ఇంతకీ ఆమె మనస్సులో ఏముందంటే..?

రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోతే.. నెట్టుకురావడం చాలా కష్టం.. కొందరు అదృష్టం మీదనో.. లేకపోతే పొలిటికల్ స్టాటజీలతోనో రాణిస్తుంటారు.. కానీ కొందరు కనుమరుగవుతుంటారు.. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై విజయశాంతి గతంలో ఓ వెలుగు వెలిగారు.. భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ నేత ఎల్.కే.అద్వానీకి దగ్గరగా పనిచేసి.. ఆయన చేసిన రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు.. అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసవ పోరాటం చేశారు.

కొద్దిరోజుల తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి.. కేసీఆర్ తో నడిచారు.. కేసీఆర్ ఆమెను చెల్లిగా అభివర్ణించారు.. పార్టీలో ప్రాధాన్యత కల్పించారు.. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీగా ఆమె గెలిచారు.. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలు తలెత్తడంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు.. 2018లో కాంగ్రెస్ పార్టీ చేరి.. ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు..

2019 ఎన్నికలు ముగిసిన వెంటనే.. మళ్లీ కమలం పార్టీలో చేరారు.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు.. ఇలా స్థిరత్వం లేకుండా పార్టీలు మారుతూ వచ్చారు ఆమె.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. గత ఎన్నికల్లో ఆమెకు టిక్కెటె రాకపోయినా.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ఆ పార్టీ పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది..

ఇటీవల రాహుల్ గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారని ప్రచారం జరిగినా.. ఇంత వరకూ ఆయన్ని కలవలేదు.. అప్పడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నా.. ఆమెను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది.. ఈ క్రమంలో అధిష్టానంతో మాట్లాడే యోచనలో విజయశాంతి ఉన్నారట.. పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించేలా ఆమె ప్లాన్ చేస్తున్నట్లు ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు.. ఆమె యాక్టివ్ అవుతారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version