ఏపీలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు వీళ్ళే

-

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ప్రోగ్రెస్ సరిగాలేని ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త ఇంచారుజులను నియమిస్తూ పెద్ద సాహసమే చేస్తోంది.ఈ క్రమంలో ఎక్కడా అసంతృప్తులు లేకుండా , కేడర్ లో పార్టీ పట్ల వ్యతిరేకత రాకుండా సీఎం జగన్ మోహన్రెడ్డి జాగ్రత్ పడుతున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ను చేరవేస్తున్న సీఎం జగన్ అదే తరహాలో పార్టీకి రీజినల్ కోఆర్డినెటర్లను ఏర్పాటు చేశారు. పార్టీ విజయమే లక్ష్యంగా వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్ ని చైతన్యపరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక జిల్లాల ఇంచారుజుల విషయానికొస్తే పార్వ‌తీపురం మ‌న్యం,శ్రీకాకుళం జిల్లాల్లోని నియోజకవర్గాలకు మంత్రి బొత్స సత్యనారాయణ ను ఇంచార్జ్ గా నియమించారు. అలాగే విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం,అల్లూరి సీతారామ‌రాజు(పాడేరు,అర‌కు నియోజ‌క‌వ‌ర్గాలు)లకు వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక మిథున్ రెడ్డి కి తూర్పుగోదావ‌రి, కాకినాడ‌, కోన‌సీమ‌, అల్లూరి సీతారామ‌రాజు (రంప‌చోడ‌వ‌రం) జిల్లాలు, ప‌శ్చిమ‌గోదావ‌రి, ఏలూరు జిల్లాలను ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డికి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాలను అప్పగించారు.రాజ్యసభ సభ్యులు విజ‌య‌సాయిరెడ్డికి ప‌ల్నాడు, బాప‌ట్ల‌,ప్ర‌కాశం, నెల్లూరు, తిరుప‌తి పార్లమెంట్ స్థానాల పర్యవేక్షణ చూడాలని సీఎం చెప్పారు.

పొన్న‌పురెడ్డి రామ‌సుబ్బారెడ్డి కి క‌ర్నూలు, అన్న‌మ‌య్య‌ జిల్లాలు,ఆకేపాటి అమ‌ర్నాధ్ రెడ్డి కి కడప, నంద్యాల‌ పార్లమెంట్ స్థానాలను ఖరారు చేశారు.ఇక వైసీపీలో సీనియర్ పొలిటిషన్ గా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి తన సొంత జిల్లా చిత్తూరుతో పాటు అనంత‌పురం,స‌త్య‌సాయి జిల్లాలను కేటాయించారు.

రీజినల్ కోఆర్డినేటర్ ల నియామక ప్రక్రియను పూర్తి చేసిన సీఎం జగన్…ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. కేడర్లో అసంతృప్తులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నేతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పారు. మొత్తానికి రెండోసారి ఏపీలో నెగ్గాలనే లక్ష్యంతో వైసీపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version