ఊహాగానాలకు తెరదించిన రేవంత్‌రెడ్డి.. మంత్రులకు శాఖల కేటాయింపు

-

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది.సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా ఆయనతో పాటు 11 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే వారికి ఏఏ శాఖలు దక్కుతాయో అనే సందిగ్ధం కొనసాగింది. శాఖలపై పలు ఊహాగానాలు కూడా నడిచాయి.తొలుత సీతక్కకి హోమ్‌ మంత్రి కట్టబెడతారని,శ్రీధర్‌రబాబుకి ఆర్ధిక శాఖ ఇస్తారని,భట్టి విక్రమార్కకు డిప్యూటీతో పాటు రోడ్డు భవనాల శాఖ కేటాయిస్తారని చాలా మంది ఊహించారు.

ఈ మేరకు ప్రత్యేక కథనాలు కూడా వండి వర్చారు. అయితే తాగాజా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన కేబినెట్‌ మంత్రులకు శాఖలను కేటాయిస్తూ నిర్ణయం ప్రకటించారు. ఊహాగానాలకు తెరదించుతూ శాఖలను ఖరారు చేశారు. మరో ఆరు మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది. వారిలో ముస్లిం మైనార్టీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు.

ఎవరెవరికి ఏ శాఖలంటే..

జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటక శాఖ
భట్టి విక్రమార్క – ఆర్ధిక, ఇంధన శాఖ
తుమ్మల నాగేశ్వర్ రావు – వ్యవసాయ, చేనేత శాఖ
ఉత్తమ్ కుమార్ – పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ
పొంగులేటి శ్రీనివాస్ – సమాచార శాఖ
శ్రీధర్ బాబు – ఐటీ శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు
దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి – రోడ్స్ అండ్ బిల్డింగ్స్
దనసరి అనసుయ (సీతక్క) – పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ
పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్
కొండా సురేఖ – అటవీ, దేవాదాయ శాఖ

మునిసిపాలిటీ,అర్బన్‌ డెవలప్‌మెంట్‌, ఎస్సీ-ఎస్టీ సంక్షేమం,కార్మిక,హోమ్‌ మంత్రిత్వశాఖలు ప్రస్తుతం సీఎం వద్దే ఉన్నాయి. సీఎం ఢిల్లీ నుంచి వచ్చాక రో ఆరుగురు మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది.వారికి మిగిలిన శాఖలను కేటాయించనున్నారు. తాజాగా శాఖలు కేటాయించడంతో బాధ్యతలు తీసుకునేందుకు మంత్రులు శుభముహూర్తాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయా శాఖల కార్యాలయాల నుంచి పరిపాలన సాగించేందుకు మంత్రులు అన్నివిధాలా సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version