ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఇప్పుడు ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంత రైతులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపధ్యంలో తెలంగాణకు అవి కలిసి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వాళ్ళు తెలంగాణా వైపు చూడటంతో తెలంగాణా ఆదాయం పెరుగుతుంది.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి పరిస్థితుల వలన అక్కడ రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని.. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుంజుకు౦దన్నారు. తెలంగాణకు ఆదాయం పెరిగిందన్న రేవంత్… పెట్టుబడిదారులు అమరావతి వైపే చూడడం లేదన్నారు. అందుకే తెలంగాణకు లాభమన్నారు. దీనిపై ఒక తెలంగాణవాడిగా సంతోషపడుతున్నానని..
అదే సమయంలో దేశ పౌరుడిగా బాధగా ఉందని అన్నారు. మరోవైపు బాధ ఉందన్న ఆయన, నిన్నటి వరకు ఆంధ్రులు, మన సోదరులుగా ఉన్నారని, కానీ అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ఆనాడు ఎన్నికల్లో సాయం చేసిన వ్యాపారస్తుడికి మేలు చేసేందుకు ఇలాంటి గందరగోళం నెలకొన్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. తన ప్రాధాన్యత తెలంగాణాకే అన్నారు.