రేవంత్ రెడ్డి ఎఫెక్ట్: వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నారా?

-

రేవంత్ రెడ్డి revanth reddy…ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ నాయకుడు. టీపీసీసీ అధ్యక్షుడుగా ఎంపికైన దగ్గర నుంచి రేవంత్ దూకుడు మామూలుగా ఉండటం లేదు. తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. అసలు రేవంత్‌కు పీసీసీ ఇస్తే చాలామంది కాంగ్రెస్‌ని వీడతారని ప్రచారం జరిగింది. కానీ అదంతా ప్రచారమే అని ఇప్పుడు తేలిపోయింది. రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకెళుతూ, మొదట పార్టీలోని అసంతృప్తులని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

రేవంత్ రెడ్డి /revanth reddy

వరుసపెట్టి సీనియర్ నేతలనీ కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే రేవంత్ విషయంలో అసంతృప్తిగా ఉన్న నేతలని సైతం కలిసి వారి మద్ధతు తీసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి లాంటి వారితో రేవంత్ భేటీ అయ్యి, కాంగ్రెస్‌లో కొత్త జోష్ తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి దాదాపు అందరి నేతల మద్ధతు తీసుకున్నారు. కానీ కొందరు నేతలు మాత్రం రేవంత్‌కు ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పొచ్చు.

రేవంత్‌కు పీసీసీ ప్రకటించినరోజే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పిన విషయం తెలిసిందే. పీసీసీని కొనుకున్నారని విమర్శించారు. ఇలా విమర్శలు చేసిన కోమటిరెడ్డి ఇంతవరకు రేవంత్‌కు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. అటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సైతం రేవంత్‌ని కలవలేదు. కాంగ్రెస్‌కు సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలని కలిశారుగానీ, శ్రీధర్ బాబు, ఇంకా టచ్‌లోకి రాలేదు.

కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబులు కూడా లైన్‌లోకి వస్తే కాంగ్రెస్‌కు మరింత ఊపు వస్తుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరి వారిని రేవంత్ ఎలా దగ్గర చేసుకుంటారో చూడాలి. అలాగే రానున్న రోజుల్లో పార్టీని ఎలా గాడిలో పెడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version