ఖమ్మంలో రేవంత్..టార్గెట్ 10..పొంగులేటి డౌటేనా.!

-

ఖమ్మం అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట..అనేక ఏళ్ల నుంచి ఖమ్మంలో కాంగ్రెస్ హవా నడుస్తుంది. అయితే తెలంగాణ వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ హవా నడిచిన..ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ హవా నడిచింది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకోగా, పొత్తులో భాగంగా టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. అటు ఒక ఇండిపెండెంట్ గెలిచారు. కేవలం బి‌ఆర్‌ఎస్ పార్టీకి 1 సీటు దక్కింది.

అంటే జిల్లాలో కాంగ్రెస్ హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మినహా మిగిలిన వారిని బి‌ఆర్‌ఎస్ లోకి లాగేసుకున్నారు. దీంతో బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాస్త పట్టు పెరిగింది. అలా అని ఆ పార్టీకి పూర్తిగా బలం రాలేదు. ఇటు కాంగ్రెస్ హవా ఏమి తగ్గలేదు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో మరొకసారి ఖమ్మంలో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఖమ్మంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో నిరుద్యోగ నిరసన సభ ఏర్పాటు చేశారు.

 

మే మొదటి వారంలో సరూర్‌నగర్‌లో జరగనున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బహిరంగ సభకు సన్నాహకంగా ఖమ్మంలో  నేడు టీపీసీసీ.. విద్యార్థి, నిరుద్యోగ నిరసన ప్రదర్శనను నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితోపాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అయితే పాదయాత్రలో ఉన్న నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క పాల్గొనే అవకాశాలు లేవు.

అయితే జిల్లాలో పట్టు సాధించాలని చెప్పి రేవంత్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గాన్ని కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. పొంగులేటి వస్తే కాంగ్రెస్ మరింత బలం పెరుగుతుంది. కాకపోతే పొంగులేటి ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకునేలా లేరు. చూడాలి మరి ఖమ్మంలో కాంగ్రెస్ హవా ఏ మేర ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version