YSR బిడ్డను చూసి KCR భయపడుతున్నారు : వైఎస్ షర్మిల

-

వైఎస్ రాజశేఖర్ బిడ్డను చూసి కేసీఆర్ భయపడుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకూ కోర్టు అనుమతి పొందాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈనెల 26న నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష నిరాహార దీక్షకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో విపక్షాల మద్దతు కూడగట్టేందుకు షర్మిల చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా లోటస్ పాండ్ నుంచి నుంచి బయలుదేరిన షర్మిలను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్డుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్​పై షర్మిల చేయి చేసుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ లోటస్ పాండ్​ వద్ద రహదారిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిలను పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. కాసేపట్లో ఆ స్టేషన్​కు వైఎస్ భారతమ్మ రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version