ఊహించని రూట్‌లో రేవంత్ రెడ్డి ..సెట్ చేసినట్లేనా!

-

మొన్నటివరకు తెలంగాణ పీసీసీ ఎవరికి దక్కుతుందా అనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్న విషయం తెలిసిందే. కాకపోతే రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కొందరు కాంగ్రెస్ సీనియర్లు  రేవంత్‌కు పీసీసీ రాకుండా ఉండటానికి గట్టిగానే ప్రయత్నించారని ప్రచారం కూడా జరిగింది. రేవంత్‌కు పీసీసీ ఇస్తే రెండు ముక్కలవుతుందని అన్నారు.

ఇక వి. హనుమంతరావు లాంటి వారైతే బహిరంగంగానే రేవంత్‌కు పీసీసీ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఇలా సీనియర్ల రాజకీయాల మధ్యలో రేవంత్‌కు పీసీసీ రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. ఒకవేళ రేవంత్‌కు ఇచ్చిన పార్టీలో కలహాలు మొదలవుతాయని, పార్టీని కొందరు సీనియర్లు వీడి వెళ్లిపోవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌కు పీసీసీ ఇచ్చింది.

అంతే ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలో రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితిని చక్కబెట్టేశారు. ఇంకా పీసీసీగా ప్రమాణస్వీకారం చేయకుండానే రేవంత్, సీనియర్లని బుజ్జగించే పనిచేశారు. మొదట జానారెడ్డి, షబ్బీర్ అలీ లాంటి వారిని కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక మొదట నుంచి తనని విమర్శిస్తున్న వి‌హెచ్‌ని హాస్పిటల్‌లో కలిసి పరామర్శించి, కేసీఆర్‌పై కలిసి పోరాటం చేద్దామని ఫిక్స్ అయ్యారు.

అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ విషయంలో కాస్త అనుకూలంగానే ఉన్నారు. పైగా కాంగ్రెస్ అధిష్టానం ఉత్తమ్‌తో మాట్లాడింది కూడా. ఇక భట్టివిక్రమార్కనైతే ఢిల్లీకే పిలిచారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న మిగతా సీనియర్లు రేవంత్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమైపోయారు. కానీ ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే రేవంత్ విషయంలో అలకపాన్పు ఎక్కి ఉన్నారు. అసలు గాంధీ భవన్ మెట్లు ఎక్కేదే లేదని తేల్చిచెప్పేశారు.

అయితే సీనియర్లని బుజ్జగించి తనవైపుకు తిప్పుకున్న రేవంత్, కోమటిరెడ్డి విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి. ఆయన్ని కూడా బుజ్జగించి తనవైపుకు తిప్పుకుంటారని తెలుస్తోంది. ఏదేమైనా రేవంత్ ఊహించని విధంగా సీనియర్లని తనవైపుకు తిప్పుకుని, కాంగ్రెస్‌ని సెట్ చేసేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version