హూజురాబాద్ రాజకీయాలు చాలా దారుణంగా తయారవుతున్నాయి. రూలింగ్ పార్టీ టీఆర్ ఎస్ తన సర్వశక్తులను ఒడ్డుతోంది. ఎలాగైనా ఈటల రాజేందర్‌ను ఒంటరి చేయాలని పకడ్బంధీగా ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఏకంగా ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం కోసమే రూ.100కోట్ల వరకు ఖర్చు పెడుతోంది. ఈటల వర్గీయులతో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ బేరసారాలు నడుపుతున్నారు.
ఇందుకోసం ఏకంగా మండలానికి ఒక ఇన్‌చార్జిని పెట్టి మరీ ఈటల వెంట నడుస్తున్న సర్పంచులను, ఎంపీటీసీలను టార్గెట్ చేస్తున్నారు. సర్పంచులకు రూ.3లక్షలు, ఎంపీటీసీలకు రూ.4లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు.
వినని వారిని నయానో, భయానో తమవైపు తిప్పేసుకుంటున్నారు. కొందరు కీలక నేతలకు భవిష్యత్‌లో మంచి పదవులు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అయితే వీటన్నింటినీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలోనే జరపుతున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ లోనే మకాం వేసి మరీ తన కేడర్ చేజారిపోకుండా చూసకుంటున్నారు. మరి ఈ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.