మళ్లీ జనంలోకి జగన్ .. ప్రచార సభల షెడ్యూల్ విడుదల..

-

జనాల నాడి తెలిసిన నాయకులు కొందరే ఉంటారు.. అలాంటివారు ప్రజలకు కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ అవ్వడం చాలా కష్టం.. అలాంటి నాయకులలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకరు.. సిద్ధం సభలతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా మారిన జగన్మోహన్ రెడ్డి మరోసారి జనాల్లోకి రాబోతున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాలని, బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు.. ఈనెల 28న ఎన్నికల ప్రచారానికి cm సిద్ధమవుతున్నారు.. ఒకేరోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలో నిర్వహించేలా ప్లాన్ చేశారట.

కూటమి కుట్రలను ఛేదిస్తూ.. మరోసారి అధికారమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. ప్రజాకర్షణ కలిగిన నేత జనంలోకొస్తే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందో సిద్ధం సభల ద్వారా ఆయన నిరూపించారు.. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు రోడ్ల మీదకు వచ్చిన తీరు కూటమి పార్టీలకు నిద్రలేని రాత్రులను తీసుకొచ్చిందట.. కేవలం 22 రోజుల్లో 23 జిల్లాలలో జైత్రయాత్రల సాగిన మేమంతా సిద్ధం రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేసింది.. జనాల్లో జగన్ కున్న ఇమేజ్ ని ఫాలోయింగ్ ని మరోసారి యావత్ దేశ ప్రజలే చూసేలా చేసింది..

మేమంతా సిద్ధంనీ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న వైసిపి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే జోష్లో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.. ఈనెల 28 నుంచి ఒకే రోజు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్రాలో సభలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశారు..

28వ తేదీ ఉదయం 10 గంటలకు తాడిపత్రి, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వెంకటగిరి, మధ్యాహ్నం మూడు గంటలకి కందుకూరు నియోజకవర్గంలో ఆయన బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు..
29వ తేదీ ఉదయం 10 గంటలకి చోడవరం, 12:30 కి పి గన్నవరం, మధ్యాహ్నం మూడు గంటలకి పొన్నూరు లో ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు.. అలాగే 30వ తేదీ ఉదయం 10 గంటలకి కొండపి, మధ్యాహ్నం 12:30 కి మైదుకూరు, మధ్యాహ్నం మూడు గంటలకి పీలేరులో బహిరంగ సభలు నిర్వహించి ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఒకటో తేదీ కూడా బొబ్బిలి పాయకరావుపేట ఏలూరు నియోజకవర్గాలలో బహిరంగ సభలు ఉంటాయని కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.. ఎన్నికలకి ఈ రెండు వారాలే కీలకం కావడంతో జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం, ప్రజల్లో ఆదరణ చూసిన ప్రతి ఒక్కరూ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే భావన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version