ఎన్టీఆర్‌ జయంతి స్పెషల్: వైసీపీలో టీడీపీ విలీనం!

-

ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రాబోతున్నాయి… ప్రతిపక్ష టీడీపీ పునాదులు కదలబోతున్నాయి… టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు రోజుల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం వైసీపీలోకి విలీనం అయ్యే పరిస్థితి రాబోతోంది! ఇన్నాళ్లు కరోనాపేరుచెప్పి పక్కరాష్ట్రంలో రెస్ట్ లోఉన్న చంద్రబాబుకు అధికార వైసీపీ దిమ్మదిరిగే షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది! రెండు నెలల విశ్రాంతి అనంతరం అభివాదాలు చేసుకుంటూ అమరావతికి వచ్చిన చంద్రబాబుకు ఆ ఆనందం ఒక్కరోజు కూడా లేకుండా అయిపోబోతోంది!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఎన్టీఆర్‌ జయంతి రోజు (మే 28 – గురువారం) కానీ, ఈరోజు (మే 26 – మంగళవారం) సాయంత్రం కానీ… సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారట! 2019 ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంల రూపంలో ప్రస్తుతం 20 మంది మాత్రమే టీడీపీలో ఉన్నట్లు లెక్క! ఇదే క్రమంలో మరో ఏడుగురు నేతలు సైకిల్ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారంట. ఈ విషయంలో బాలినేని శ్రీనివాస్, విజయసాయిరెడ్డి లు కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది! ఇదే జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లోనే టీడీపీలో పెను సంక్షోభం చోటుచేసుకోవడం ఖాయం అని చెప్పొచ్చు!

మహానాడుకు ముందురోజే బాబుకు ఈ దిమ్మతిరిగే షాక్ ఇచ్చే క్రమంలో ఈ ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో వైకాపా చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని… ఈ క్రమంలో సాయంత్రం లోపు సీఎం జగన్ సమక్షంలో తెదేపా ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వస్తోన్న ఊహాగానాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం నిజమయ్యి.. టీడీపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కనుక వైకాపాలో చేరితే.. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోయి, టీడీపీ మొత్తం పార్టీ వైసీపీలో విలీనం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version