తెగ.. బెంగపడిపోతున్న షర్మిల.. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్..?

-

తెలంగాణ రాజకీయాల్లో పాగా వేయడం కోసం.. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి కూతురు వై. ఎస్. షర్మిల ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. షర్మిల సోదరుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలో రాజకీయాలు చేయడమే తన ఉద్దేశం అని చాటి చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ లో రాజన్న రాజ్యం తేవడం కోసం శ్రమిస్తానని ప్రకటించారు. వెంటనే షర్మిల పై ఇక్కడి నేతలు షర్మిల ఇక్కడి వ్యక్తి కాదని తనది ఆంధ్రా అని అనడంతో.. స్పందించిన షర్మిల తాను తెలంగాణ కోడలినని తనను ఇక్కడ రాజకీయాలు చేయకుండా ఎవరు కూడా ఆపలేరని ప్రకటించారు.

sharmila

త్వరలో షర్మిల పార్టీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తన తండ్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పార్టీ ప్రకటిస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇందు కోసం జిల్లాల వారిగా సభ్యులతో సన్నాహక కమిటీలను కూడా.. ప్రకటించారు. పార్టీ ప్రకటన కోసం అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుండగా… ప్రస్తుతం షర్మిలకు ఓ చిక్కొచ్చి పడిందట.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచే తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఆయన వెంటే నడిచింది. తాజాగా వీరంతా షర్మిల రాకతో అటు వైపుకు వెళ్తారని అంతా భావించారు. షర్మిల కూడా అలాగే అనుకుంటుండగా… రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రకటించడంతో షర్మిల ఆలోచనలన్నీ తారుమారయ్యాయని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ తో రెడ్డి సామాజిక వర్గం ఆయన వెంటే నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల మాట. షర్మిలకు సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం.. తెలంగాణ రాజకీయాల్లో బలమైన రెడ్డి నేత లేకపోవడమేనట. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో సీన్ తారుమారైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version